- 77.40 ఎంటీపీఏకి పెరగనున్న అదానీ గ్రూప్ సిమెంట్ కెపాసిటీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్ ఏషియన్ కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్‌లోని మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేశామని ప్రకటించింది. మిగిలిన 55 శాతం వాటాను రూ.425.96 కోట్లకు దక్కించుకున్నామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఏషియన్ కాంక్రీట్స్ (ఏసీసీపీఎల్) లో 100 శాతం వాటా తమకు దక్కిందని, ఏసీసీపీఎల్‌ఎంటర్‌ప్రైజ్ వాల్యూ రూ.775 కోట్లని వెల్లడించింది.
ఏసీసీ గ్రోత్ స్ట్రాటజీకి అనుగుణంగా ఈ డీల్ ఉందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ కపూర్ పేర్కొన్నారు. స్టేక్ హోల్డర్ల సంపదను పెంచడంపై కంపెనీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఏసీసీపీఎల్ కొనుగోలుతో ఏసీసీ మొత్తం సిమెంట్ ప్రొడక్షన్ ఏడాదికి 38.55 మిలియన్ టన్నులకు (ఎంటీపీఏ) చేరుకుంటుంది. అంబుజా సిమెంట్ కెపాసిటీతో కలిపితో అదానీ గ్రూప్ సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 77.40 ఎంటీపీఏకు పెరుగుతుంది.
