బాసర : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలోని హాస్టల్లో ఆదివారం ఉదయం సీలింగ్ ఫ్యాన్ ఊడి పడి జల్లూరి శ్రావణ్ అనే స్టూడెంట్ గాయపడ్డాడు. ప్రతి రోజు లెక్కనే శనివారం రాత్రి హాస్టల్ లో విద్యార్థులంతా భోజనం చేసి పడుకున్నారు. ఆదివారం ఉదయం తిరుగుతున్న ఫ్యాన్ ఊడి మీద పడడంతో కింద పడుకున్న శ్రావణ్ మెడకు గాయాలయ్యాయి. వెంటనే తోటి విద్యార్థులు క్యాంపస్ లోని హాస్పిటల్ కు తరలించారు. కొద్ది రోజుల కింద హాస్టల్ లో పీఓపీ( ప్లాస్టర్ఆఫ్ ప్యారిస్) పడడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనను మర్చిపోక ముందే ఫ్యాన్ ఊడిపడడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏ ఫ్యాన్ పడుతుందోనని భయపడుతున్నారు.
