హైదరాబాద్ సరూర్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్ పై ప్రమాదం జరిగింది. దిల్ సుఖ్ నగర్ నుండి చైతన్య పురి వైపు యూ టర్న్ తీసుకుంటున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి కంకర లారీ ఢీకొట్టింది. వేగంగా వస్తున్న కంకర లోడ్ టిప్పర్ లారీ బస్సు మధ్యలో ఢీకొనడంతో బస్సు ట్రాఫిక్ బాక్స్ పైకి వెళ్లి నిలిచిపోయింది.
2026 మే 29న జరిగిన ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సు మద్య భాగంలో లారీ ఢ కొనడంతో బస్సు పెద్ద ఎత్తున ధ్వంసమైంది. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు యూ టర్న్ తీసుకుంటుండగా టిప్పర్ ఢీకొట్టడంతో ట్రాఫిక్ బాక్సుపైకి వళ్లిన బస్సు.. రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. దీంతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. జేసీబీ సాయంతో పోలీసులు బస్సును రోడ్డు పక్కకు తరలించారు.
