రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

యాదాద్రి : రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మహిళ తల్లిగారింటికి(కేసారం) వస్తున్న సమయంలో ఇవాళ ఉదయం భువనగిరి మండలం కుమ్మరిగూడెం దగ్గర ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బైక్ స్పీడ్ గా ఉండటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు.

విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు ప్రమాదస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. చనిపోయిన వీరిద్దరికీ ఫిబ్రవరి-22నే మ్యారేజ్ అయ్యిందని తెలిపారు కుటుంబసభ్యులు. మృతురాలు దివ్య (19) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా..ఆమె భర్త నరేశ్ గాంధీ హస్పిటల్ లో ఉద్యోగి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.