మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా హతమార్చిన ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. హత్య చేసి మంచంపై గొడ్డలి వదిలేసి హంతకుడు పారిపోయాడు. చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మంచాలలోని పరిధిలోని నోముల గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న అమృతను ఆమె భర్త బాబు గొడ్డలితో నరికి చంపాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నోములకి చెందిన మధర్మోని బాబు మధ్యాహ్నం తన భార్య అమృతను మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనకు ముందు వారి కోడలిని వేరే రూమ్లో గదికి తాళం వేసి ఉంచి ఈ ఘాతుకానికి నిందితుడు ఒడిగట్టాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | రెండు నెలల కొడుకు ఏడుపును కూడా భరించలేని కసాయి తల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి పొయ్యిలో పడేసింది !
