
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందని 15వ ఆర్థిక సంఘం తెలిపింది. 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి 80 వేల కోట్లు ఖర్చు చేశారని వివరించింది. ఈ ఎత్తిపోతలకు భారీగా కరెంట్ బిల్లు వస్తుందని, నిర్వహణకు అయ్యే మొత్తాన్ని వినియోగ చార్జీల ద్వారా పొందాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. కచ్చితమైన ఆదాయ వనరులు లేకుంటే ప్రాజెక్ట్ ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపింది. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదికలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలున్నాయి. తాగు, సాగు నీటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుందని చెప్పింది 15వ ఆర్థిక సంఘం. రికవరీకి అవకాశం లేకపోవడంతో ఈ రుణాలపై వడ్డీలను బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నారని, ఇది ద్రవ్య లోటుకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించింది.
see more news