తెలంగాణ ప్రజాప్రతినిధులపై 115 కేసులు

తెలంగాణ ప్రజాప్రతినిధులపై 115 కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలపై115 కేసులు ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రీ తెలిపింది. ప్రజాప్రతినిధుల కేసులు సత్వరం విచారణ చేయాలని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ అమల్లో భాగంగా.. ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల వివరాలివ్వాలని హైకోర్టు గతంలో రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రీ తరఫు అడ్వొకేట్‌‌‌‌ జి.విద్యాసాగర్‌‌‌‌ శుక్రవారం ప్రజాప్రతినిధులపై కేసులు–వాటి విచారణ పరిస్థితులపై నివేదికను కోర్టుకు అందజేశారు. గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను సుమోటోగా చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే ఆధ్వర్యంలోని బెంచ్‌‌‌‌ శుక్రవారం విచారించింది. నివేదికను పరిశీలించాక హైకోర్టు, ఆ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆయా ఉత్తర్వులు జారీ చేసింది.