దేశ వ్యాప్తంగా 50 కోట్ల డోసులు వేశాం

దేశ వ్యాప్తంగా 50 కోట్ల డోసులు వేశాం
  • దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నయ్​.. కేంద్ర ఆరోగ్య శాఖ

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 49.53 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 44 వేల కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో వైరస్ బారిన పడుతున్నోళ్ల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా 44 వేల మార్కును దాటాయి. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా రూల్స్ పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. వారం క్రితం 29 వేల దాకా తగ్గిన కేసులు, ఆ మరుసటి రోజే 42 వేలకు చేరినయ్. మూడ్రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం 30,549, బుధవారం 42,625, గురువారం 42,982 కేసులు నమోదు కాగా.. శుక్రవారం 44,643 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.18 కోట్లకు చేరింది. కాగా, దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్​లో భాగంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 49.53 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
వైరస్​తో 464 మంది మృతి.. 
వైరస్​తో మరో 464 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 4 లక్షల 26వేల 754కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా మూడో రోజూ యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం 4 లక్షల 14వేల 159 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. మొత్తం కేసుల్లో ఇవి 1.30 శాతమని చెప్పింది. గురువారం 16లక్షల 40వేల 287 టెస్టులు చేశామని, దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 47.65 కోట్లకు చేరిందని పేర్కొంది. దేశంలో  డైలీ పాజిటివిటీ రేటు 2.72 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.41 శాతంగా, రికవరీ రేటు 97.36 శాతంగా, డెత్ రేటు 1.34 శాతంగా నమోదైందని వివరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.10 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ అధికారులు  వెల్లడించారు.
83 మందికి డెల్టా ప్లస్..​
దేశంలో ఆగస్టు 4వ తేదీ వరకు 83 డెల్టా ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. వీటిలో మహారాష్ట్రలో 33, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11, తమిళనాడు లో 10 కేసులు గుర్తించినట్టు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ లో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి భారతీ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీనోమ్ సీక్వెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రైవేటు ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అనుమతినిచ్చే విషయం పరిశీలనలో ఉందన్నారు. ‘ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏసీఓజీ (సార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సీఓవీ–2 జీనోమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్జార్షియమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేయడానికి పలు ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆసక్తిగా ఉన్నాయి. వాటికి ఉన్న మౌలిక సదుపాయాలు, హ్యూమన్ రిసోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ’ అని పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.  జీనోమ్ సీక్వెన్సింగ్ నిరంతర ప్రక్రియ, అది జరుగుతూనే ఉంటుందని చెప్పారు. వాటి వివరాలు ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏసీఓజీ ఇచ్చే బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పబ్లిక్ డొమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటాయన్నారు.