జనగామ, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని డిప్యూటీ సీఈవో పద్మావతి ఆదేశించారు. జనగామ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్‌పై రివ్యూ నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉంటున్న వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఓటరు మ్యాపింగ్ శాతాన్ని మరింతగా పెంచాలని అన్‌మ్యాప్డ్ ఎలక్టోరల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అయితే అర్హులైన వారి ఓటర్ల హక్కు పోకుండా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగాలని ఆదేశించారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్, ఎలక్షన్ సూపరింటెండ్ శ్రీధర్, అన్ని మండలాల తహసీల్దార్లు ఉన్నారు.
