పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్‌: పొక్సో కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. 2022లో జరిగిన మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసును విచారించిన నాంపల్లి కోర్టు నిందితుడికి 20యేళ్ల జైలు శిక్ష విధించింది. బుధవారం (జూలై30) హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో పొక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అంబర్‌పేట్ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో నాంపల్లి కోర్టులోని 12వ అడిషనల్ సెషన్స్ జడ్జి తీర్పు వెలువరిస్తూ..నిందితుడు సలిమెడ వంశీకి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అదనంగా  బాధిత బాలికకు 2 లక్షల రూపాయల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.

ఈ తీర్పు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడంలో పొక్సో యాక్ట్ బలమైన న్యాయ చట్రాన్ని ప్రతిబింబిస్తుంది.