రోజూ ఫుడ్‌ను టైమ్‌కు తినకపోవడం, ఏది పడితే అది తింటే అది అరగక కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్రెడ్ (గ్యాస్ట్రో ఈసొ ఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్) వల్ల అసిడిటీ ప్రాబ్లమ్ వస్తుంది. ఫుడ్‌లో ఎక్కువగా స్వీట్స్, ఉప్పు లేదా స్పైసీగా ఉండేవి తిన్నా, పొగాకు, మద్యం, కెఫిన్‌ల అలవాటు ఉన్నా కూడా ఇబ్బందే. అంతేకాదు స్ట్రెస్ కూడా దీనికి కారణం అంటున్నారు. మరి దీన్నుంచి బయటపడాలంటే ఫుడ్ హ్యాబిట్స్‌తో పాటు కొన్ని యోగాసనాలు వేయాలి. అవేంటంటే...
వజ్రాసనం
వజ్రాసనం వేయడం వల్ల మనసు స్టేబుల్‌గా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. వజ్రాసనం వేయడం వల్ల కడుపు, పేగులకు రక్తప్రసరణ బాగా జరిగి గ్యాస్ తయారవదు. జీర్ణక్రియను ఇంప్రూవ్ చేసి అసిడిటీని తగ్గిస్తుంది.
ఎలా చేయాలంటే
యోగ మ్యాట్ మీద మోకాళ్లను వెనక్కు మడిచి, నెమ్మదిగా తొడలపై కూర్చోవాలి. అరికాళ్లు ఆకాశాన్ని చూసేలా ఉంచాలి. తరువాత మెడ, వీపు నిటారుగా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలాలి.
పవన ముక్తాసనం
రోజూ పవనముక్తాసనం చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్‌లోని వేస్ట్ మెటీరియల్, టాక్సిన్స్ పోతాయి. పవనముక్తాసనం వల్ల పెద్దపేగులో కదలికలు జరిగి డైజెషన్ బాగా జరుగుతుంది.
ఎలా చేయాలంటే
యోగా మ్యాట్ మీద వెల్లకిలా పడుకోవాలి. తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతితో మోకాలిని పట్టుకుని నెమ్మదిగా ఛాతికి ఆన్చాలి. తరువాత శ్వాస వదలాలి. అలా రెండు కాళ్లతో చేసాక, ఒకేసారి రెండు కాళ్లను చేతులతో తీసుకొని ఛాతికి ఆన్చాలి.
త్రికోణాసనం
ఇది ట్రయాంగిల్ షేప్‌లో ఉండే ఆసనం. త్రికోణాసనం వల్ల పెద్దపేగులో కదలికలు జరిగి డైజెషన్ బాగా జరుగుతుంది.
ఎలాచేయాలంటే
నిల్చొని కాళ్లను దాదాపు మూడు ఫీట్ల ఎడం జరపాలి. రెండుచేతులను భుజాలకు సమానంగా తీసుకోవాలి. తరువాత మెల్లగా ఊపిరి తీసుకొని ఎడమచేతిని పైకి లేపి కుడిచేతితో కింద పాదాన్ని తాకాలి. తరువాత నార్మల్ పొజిషన్‌లోకి వచ్చి ఊపిరి వదలాలి. ఇలా రెండు పక్కలా చేయాలి.
ఉష్ట్రాసనం
దీన్నే ఒంటె ఆసనం అనికూడా అంటారు. ఉష్ట్రాసనం వల్ల వెన్ను నొప్పి పోతుంది. మెదడు రిలాక్స్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అలాగే రెస్పిరేటరీ, ఎండోక్రైన్, నెర్వస్ సిస్టమ్స్ బాగుంటాయి.
ఎలాచేయాలంటే
మోకాళ్లపైన కూర్చొని వీపు నిటారుగా పెట్టి ఉంచాలి. తరువాత రెండు చేతులు నడుము పైన ఉంచి శ్వాస తీసుకొని వెనక్కి వంగాలి. తరువాత నార్మల్ పొజిషన్‌కి వచ్చి శ్వాస వదలాలి. అలా చేశాక మళ్లీ వెనక్కి వంగి రెండు చేతులతో పాదాలను తాకాలి.
