అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన అంజలి భరద్వాజ్

అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన అంజలి భరద్వాజ్

అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్‌ అవార్డుకు భారత మహిళ …ఉద్యమ కర్త, సామాజిక వేత్త అంజలి భరద్వాజ్‌ ఎంపికయ్యారు. సాహసోపేత వ్యక్తులకు ఇచ్చే ఈ అవార్డుకు ఎంపికైన 12 మందిలో ఆమె ఒకరు. ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వ్యవస్థ కొత్తగా ఏర్పాటు చేసింది.

భారత్‌లో 20 ఏళ్లుగా సాగిన సమాచార హక్కు ఉద్యమంలో క్రియాశీలక సభ్యురాలిగా అంజలి వ్యవహరించారని తెలుస్తోంది. ప్రభుత్వంలో పాదర్శకత, జవాబుదారీ తనం పెంపొందించేందుకు, ప్రజలను అందులో భాగస్వాములను చేసేందుకు సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ (NNS) అనే సంస్థను ఏర్పాటు చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని బహిర్గతం చేస్తున్న వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్నారు. అవినీతి నిరోధక న్యాయవాదిగా, విజిల్‌ బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆమె కృషి చేశారు. ఈ అవార్డులో తన పేరు ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు.

పాదర్శకతను కాపాడటానికి, అవినీతిపై గళమెత్తి… స్వంత దేశంలో జవాబుదారీతనం నిర్ధారించడానికి అవిశ్రాంత కృషి చేసిన వ్యక్తులకు అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్‌ అవార్డులను ప్రకటిస్తున్నామని తెలిపారు అమెరికా విదేశాంగ కార్యదర్శి టోని బింక్లేన్‌.