Ajith: గంటకు 234కి.మీ. వేగంతో కారు నడిపిన స్టార్ హీరో

Ajith: గంటకు 234కి.మీ. వేగంతో కారు నడిపిన స్టార్ హీరో

తన చర్యలతో నలుగురికి ఆదర్శప్రాయుడిగా నిలవాల్సిన ఓ స్టార్ హీరో అతి వేగంగా కారు నడిపి విమర్శల్లోకెక్కాడు. ఆ నటుడు మరెవరో కాదు.. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్‌. ఈ స్టార్ హీరో అతి వేగంగా కారు నడపడటమే తప్పంటే.. ఆ దృశ్యాలను చిత్రీకరించి మరింత పెద్ద తప్పు చేశాడని విమర్శలు వస్తున్నాయి. 

హీరో అజిత్ తన ఆడీ కారులో గంటకు 234 కి.మీల వేగంతో దూసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో ప్రారంభంలో 205 కిలో మీటర్లుగా ఉన్న వేగం అంతకంతకూ పెరుగుతూ గంటకు 234 కి.మీటర్లకు చేరుకుంది. అజిత్ కారు నడుపుతుండగా.. పక్కనున్న వారు ఆ వేగాన్ని.. కారు దూసుకెళ్తున్న దృశ్యాలను మొబైల్ లో బంధించారు.

అతి వేగం ప్రమాదకరం

ఎంత రేసర్ అయినప్పటికి.. సాధారణ రోడ్లపై అతి వేగంగా కారు నడపటం సరైన నిర్ణయం కాదని అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే ఊహించుకోలేమని వాపోతున్నారు. 

ఇక అజిత్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో న‌టిస్తున్నారు. విదాముయార్చి సినిమాను మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో త్రిష హీరోయిన్. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు అధిక్‌ రవిచంద్రన్ డైరెక్టర్.