జవాన్లతో అక్షయ్‌‌ ఆటాపాట

జవాన్లతో అక్షయ్‌‌ ఆటాపాట
  • నీరూ గ్రామంలో స్కూలు కట్టడానికి ​రూ. కోటి విరాళమిచ్చిన అక్షయ్

బాలీవుడ్‌‌ నటుడు అక్షయ్‌‌ కుమారు గురువారం లైన్‌‌ ఆఫ్‌‌ కంట్రోల్‌‌(ఎల్‌‌వోసీ) ఏరియాలోని తులైల్‌‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బీఎస్‌‌ఎఫ్‌‌ జవాన్లను కలిశారు. వాళ్లతో ఆడిపాడారు. జవాన్లతో దిగిన ఫొటోలను ట్విట్టర్‌‌లో పంచుకున్నారు. సరిహద్దులను కాపాడుతున్న జవాన్లను కలవడం ఎన్నటికీ మరువలేని జ్ఞాపకమని చెప్పారు. కాగా, అక్కడి నీరూ గ్రామంలో స్కూలు కట్టడానికి అక్షయ్​ రూ. కోటి విరాళం ఇచ్చినట్లు సమాచారం.