నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

తన తండ్రి ఎన్టీఆర్ పట్ల బాలకృష్ణకి అపారమైన గౌరవం, ప్రేమ. అందుకే కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో ఆయన బయోపిక్‌‌ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. అంతేకాదు.. యేటా తండ్రి జయంతికి, వర్ధంతికి ఏదో ఒక రూపంలో నివాళి అర్పిస్తుంటారు. ఈసారి మరింత ప్రత్యేకంగా ఆయన్ని స్మరించుకున్నారు. నిన్న ఎన్టీఆర్ 99వ జయంతి కావడంతో శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆల‌‌పించి గాత్ర నివాళి అర్పించారు బాలయ్య. తన నిర్మాణ సంస్థ ఎన్.బి.కె.ఫిల్మ్స్ ద్వారా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన గానాన్ని విని అభిమానులు ఖుషీ అయిపోయారు. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జీవితంపై పుస్తకం రాస్తానని ప్రకటించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ జీవితాన్ని సిలబస్​లో చేర్చాలని కూడా కోరారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌‌లో ‘అఖండ’ మూవీ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ నిన్న విడులదలయ్యేది. కానీ సెకెండ్ వేవ్‌‌ షూటింగ్‌‌కి బ్రేక్ వేయడంతో విడుదల వాయిదా పడింది. త్వరలోనే బ్యాలెన్స్ షూట్‌‌ని కంప్లీట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు బాలయ్య.