ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్స్.. అందుకే ఈ సైలెన్స్

ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్స్.. అందుకే ఈ సైలెన్స్

ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) చేసిన ఒక ట్వీట్ మూలంగా తనపై వచ్చిన బ్యాడ్ కామెంట్స్, ట్రోలింగ్స్ పై స్పందించారు. తాను ఏ పరిస్థితులలో ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది, దానివల్ల ఆయనకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ ఏంటి అనేదాని గురించి వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన కుమారుడు సంజయ్ రావ్(Sanjay rao) హీరోగా వస్తున్న స్లమ్ డాగ్ హస్బెండ్(Slum Dog Husband) సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన ఈమేరకు క్లారిటీ ఇచ్చారు. 

ALSOREAD :పెరిగిన గోధుమ పిండి ధర.. కిలో రూ.320.. షాక్ లో పబ్లిక్

"నేను ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల గురించి ట్వీట్ చేశాను, ఆరోజు భారీ వర్షం కురిసింది. నా భార్య నేను కారులో ఉన్నాం. ఇంటికి వెళ్లే దారులన్నీ నీటితో నిండిపోయాయి. దగ్గరలో తెలిసిన వారింట్లో కారు పార్క్ చేసి పక్కనే ఉన్న వంతెన మీదుగా మా ఇంటికి చేరుకున్నాము. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు మాకు చాలా సహాయం చేశారు. ఇదే విషయాన్ని కాస్త సెటైరికల్ గా.. నేను ఓ బోటు కొనాలనుకుంటున్నాను. సూచనలు ఇవ్వండి అని ట్వీట్ చేశాను. దానికి హైదరాబాద్ రెయిన్ అనే టాగ్ ఇచ్చాను. దానికి నాపై చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాదు.. ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్స్ చేశారు. నేను ఎందుకు అలా పోస్ట్ పెట్టాను అనే వివరణ కూడా ఇచ్చాను.. అయినా అలాగే కామెంట్స్ చేశారు. అందుకే కొంతకాలంగా ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నాను" అని చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ. ప్రస్తుతం బ్రహ్మాజీ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.