
పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అక్కడి నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. కిలో గోధుమ పిండి ధర అక్షరాల 320 రూపాయలంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గోధుమ పిండిని అత్యంత ఇష్టంగా తినే పాకిస్థానీయులు ఒక్క సారిగా ఎక్కువగా వినియోగించడంతో సరఫరాకు వినియోగానికి భారీ తేడా ఏర్పడింది. దీంతో గోధుమ పిండి ధరలు చుక్కలనంటుతున్నాయి.
ప్రపంచంలోనే ఈ పిండి ధరలు పాక్‌లోనే ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. ఆ దేశంలోని ప్రధాన నగరమైన కరాచీలో 20 కిలోల గోధుమ పిండి బస్తా రేటు రూ.3వేల200 గా ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండీ, సియల్‌కోట్, ఖుజ్దర్‌లో 20 కిలోల బస్తాపై రూ.106, రూ.133, రూ.200, రూ.300 చొప్పున ధరలు పెరిగాయి.
ALSOREAD :టమాటాలతో తులాభారం.. దేవుడి దగ్గరా వెరైటీ వదల్లేదే
వాటితోపాటు బహవల్పూర్, ముల్తాన్, సుక్కూర్, క్వెట్టా పట్టణాల్లో వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. షుగర్ ధర సైతం కిలోకు రూ.160 చొప్పున పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.