
దేశంలో ప్రస్తుతానికి టమాటాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటాలు రూ. 120 నుంచి 150 వరకు పలుకుతోంది. టమాటాలకు రేట్లు పెరిగినప్పటి నుంచి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టమాటల గురించి మీమ్స్, సెటైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో టమాటాలున్న వాళ్లే రిచ్ అంటూ సెటైర్లూ లేకపోలేదు. కొన్ని చోట్ల టమాటాలకు బౌన్సర్లతో సెక్యూరిటీ పెట్టడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా మనం చూశాం. మధ్యప్రదేశ్ లో కూరలో రెండు టమాటాలు ఎక్కువ వేశాడని భర్తను వదిలేసిన ఘటన అందరిని అవాక్కయ్యేలా చేసింది.
ALSOREAD :సీఎం కేసీఆర్పైనే పోలీసులకు కంప్లయింట్ : కేసు పెడతారా లేదా ?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడిలో చాలా మంది బెల్లం, డబ్బులు పంచదార వంటి వేస్తారు..కానీ అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో వెరైటీగా జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు టమాటాలతో తులాభారం ఇచ్చారు. 51 కేజీల టమాటాలు, బెల్లం, పంచదారలతో తులాభారం వేసి మొక్కు తీర్చుకున్నారు. బెల్లం,పంచదార, టమాటలను గుడిలో నిత్యాన్నదానంకి అందజేశారు. టమాటాల తులాభారాన్ని స్థానికులు ఆశ్యర్యంగా చూసేందుకు ఎగబడ్డారు. టమాటాలతో కూడా తులాభారం వేస్తారా అని చర్చించుకుంటున్నారు.
https://twitter.com/VizagNewsman/status/1680803928135573504