శాకుంత‌లం దుష్యంతుడు వ‌చ్చేశాడు

శాకుంత‌లం దుష్యంతుడు వ‌చ్చేశాడు

యూటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన టాలెంట్‌‌‌‌ ఏంటో చూపించిన సమంత.. మొదటిసారి ఓ పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలమ్‌‌‌‌’లో శకుంతల పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ దశలో ఉంది. పౌరాణికంగా రూపొందుతున్న సినిమాలో ‘దేవ్ మోహన్ రాజు’ దుష్యంత్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అడవిలో తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తున్నారు. రాజుగా.. మనోహరంగా కనిపిస్తున్నాడు. 

ఈ ఫొటోను Gunaa Teamworks షేర్ చేసింది. గుణ.. ‘హ్యాపీ బర్త్ డే అవర్ ఛార్మింగ్ అండ్ వాలియంట్ కింగ్ దుష్యంత్’ అంటూ విషెస్ చెప్పింది. దిల్ రాజు సమర్పణలో నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.