దిశ ఘటనకు నా సినిమా సీన్‌కు లింక్ పెట్టారు

దిశ ఘటనకు నా సినిమా సీన్‌కు లింక్ పెట్టారు

నెక్స్ట్ ఇలాంటి సినిమా చేయను
స్పెషల్ సాంగ్‌ కైనా రెడీ

‘నటనను మెరుగు పరచుకోవాలంటే కొత్త జానర్స్ ట్రై చేయాలి. అందుకే ‘90 ఎంఎల్’ లాంటి కమర్షియల్ సినిమా చేశాను తప్ప, మాస్ హీరో అయిపోవాలనే కోరికతో కాదు’ అంటున్నాడు కార్తికేయ. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి కార్తికేయ చెప్పిన విశేషాలు..

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన మాస్ సినిమా. లాజిక్స్ పట్టించుకోకుండా ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించాలనే ఉద్దేశంతో నటించాను. అందుకే మల్టీప్లెక్సులు కాకుండా హైదరాబాద్‌‌‌‌లోని మాస్ థియేటర్స్‌‌‌‌ని సందర్శించాం. ఈలలు, చప్పట్లతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు నటనపై ఆసక్తి పెరిగింది డ్యాన్సుల వల్లే. కానీ గత చిత్రాల్లో డ్యాన్స్‌‌‌‌కి ప్రాధాన్యత గల పాటల్లేవు. ఈ సినిమాతో ఆ చాన్స్ దక్కింది. కామెడీ టైమింగ్ వర్కవుటయినందుకు కూడా హ్యాపీ. గత చిత్రాల్లోని పాత్రల వల్ల ఎమోషనల్ సీన్స్ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. నటనను మెరుగుపర్చుకునేందుకు కొత్త జానర్స్ ట్రై చేస్తున్నాను. ఒక సినిమా హిట్టయిందని ఆ జానర్ దగ్గరే ఆగిపోతే ఎదగలేం. విమర్శలను స్వాగతిస్తాను. నాకు నచ్చే కదా నటించాను, ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదు అనేది తెలుసుకుంటాను. ఆ తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతాను.

‘ఆర్ఎక్స్ 100’ అజయ్ భూపతి ఇచ్చిన గిఫ్ట్. అది నాకేమీ నేర్పలేదు. ఆ తర్వాతి చిత్రాల ఎంపిక నుండే చాలా నేర్చుకుంటున్నాను. యాక్టింగ్ నా డ్రీమ్. దాన్ని ఫుల్‌ ఫిల్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఫలానా పాత్ర నాకు సెట్టవుతుందా లేదా అనే స్థాయిలో ఆలోచించట్లేదు. నటించడమే వరంలా భావిస్తున్నాను. సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ అనే తేడా లేదు. నెగిటివ్ రోల్స్ అయినా ఓకే. మరొకరి సినిమాలో నేను నటిస్తే అది నా కెరీర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆ సినిమాకీ హెల్స్ అయ్యేదైతే స్పెషల్ సాంగ్స్‌కీ సిద్ధం. ఈ సినిమాతో కమర్షియల్ జానర్ ట్రై చేశాను కనుక నెక్స్ట్ ఇలాంటి సినిమా చేయను. యాక్షన్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాను. కామెడీ కూడా ఉంటుంది. డిఫరెంట్ ఎమోషన్‌తో సాగే ఓ లవ్ స్టోరీ చేస్తున్నాను. జయాపజయాల్ని ఊహించి చెప్పలేను కానీ ప్రేక్షకుల్ని సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసేలా ఉంటాయి ఆ సినిమాలు.

దిశ ఘటన జరిగినప్పటి నుంచి ‘గుణ’ చిత్రంలోని నా సీన్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అది చూసి చాలా గిల్టీగా ఫీలయ్యాను. ఎంతో కోపం వచ్చినప్పటికీ ఒక ట్వీట్ చేయడం మినహా ఏమీ చేయలేక పోయాను. నా నిస్సహాయ స్థితికి నేనెంతో బాధపడ్డాను.