అన్న అనే పదానికి అర్థం తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్

అన్న అనే పదానికి అర్థం తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్

అన్న అనే పదానికి అర్థం తెలిసేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. ఇంట్లో పెద్దవాడినైన నాకు అన్న అని పిలిచే అదృష్టం లేదని.. కానీ ఎన్టీఆర్ వల్లే తనకు ఆ అదృష్టం దక్కిందని ఆయన అన్నారు. గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఆ ట్వీట్ యదావిధిగా మీకోసం..

‘మా ఇంట్లో పెద్ద కుమారుడిని నేనే. నాకు అన్నయ్య అనే పదానికి అర్థం తెలిపిన మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి, మహా పురుషుడు, భారతదేశం గర్వించదగినటువంటి నటుడు, నిర్మాత, దర్శకుడు, ముఖ్యమంత్రి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. అన్నయ్య ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి దీవెనలు నా కుటుంబానికి ఉండాలని.. వారి పుట్టినరోజున జ్ఞాపకం చేసుకుంటూ.. వారికి పాదాభివందనం’ అని ట్వీట్ చేశారు.

For More News..

మీ మన్ కీ బాత్ కాదు.. వలస కూలీల మన్ కీ బాత్ వినండి

పనివాళ్లను ఫ్లైట్లో సొంతూరికి పంపించిన యజమాని

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు