రమ్య ఆరోపణల్లో వాస్తవం లేదు

రమ్య ఆరోపణల్లో వాస్తవం లేదు

తన రెండో భార్య రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. ఆమె చెబుతున్న  మాటల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. బెంగళూర్ కు చెందిన ఓ ఛానల్ తో కలసి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వదంతులు సృష్టిస్తుందని చెప్పారు. రూ.50 లక్షల కోసం ఇంట్లో వాళ్లని పీడించిన రమ్యకు నెల క్రితమే విడాకుల నోటీసు పంపినట్లు స్పష్టం చేశారు. ఆమె  రూ. 50 లక్షలు డిమాండ్‌ చేస్తే.. కృష్ణ చెబితే రూ. 10 లక్షలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. 

200లకు పైగా సినిమాలు చేసిన తాను 100 మందికి పైగా హీరోయిన్స్‌తో వర్క్‌ చేసినా తనపై ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదని నరేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఏలాంటి వాడినన్న విషయం అందరికి తెలుసని.. విడాకుల నోటీసు పంపిన తర్వాత  పవిత్రతో తనకు పెళ్లి కాబోతుందని రమ్య రూమర్స్ క్రియేట్ చేసిందని చెప్పారు. ఈ అంశంపై కన్నడ మీడియాకు వివరణ ఇచ్చానని అన్నారు. రమ్య రఘుపతి చేసిన మోసాలు, బ్లాక్ మెయిల్ అవమానకరమని.. పవిత్ర లోకేష్ ని లింక్ చేసి రూమర్స్ క్రియేట్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రను తాను పెళ్లి చేసుకోలేదని.. ఆమె తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని నరేశ్ క్లారిటీ ఇచ్చారు.