అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా

ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా (77) అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని జూలై 1వ తేదీ సోమవారం శత్రుఘ్న కుమారుడు లవ్ సిన్హా వెల్లడించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లవ్ సిన్హా.. "గత రెండు రోజులుగా నాన్నకు వైరల్ జ్వరం ఉంది. దీంతో బలహీనంగా మారారు. అందుకే నాన్న ఆసుపత్రిలో చేర్పించాం" అని చెప్పారు.

జూన్ 23వ తేదీన బాలీవుడ్ నటడుదు జహీర్ ఇక్బాల్‌తో తన కుమార్తె, నటి సోనాక్షి సిన్హా మతాంతర వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

కాగా, సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్.. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి చాలా సింపుల్ గా రిజిస్ర్టార్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇటీవల ముంబైలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విందులో ఈ కొత్త జంట పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. సోనాక్షి సిన్హా పెళ్లికి ముందు శత్రుఘ్న సిన్హా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విస్రృత ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 59,564 ఓట్లతో ఆయన విజయం సాధించారు.