ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టుగా ఉంది : పూనమ్ కౌర్

ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టుగా ఉంది : పూనమ్ కౌర్

భారత్ జోడో యాత్రలో నటి పూనమ్ కౌర్ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ క్రమంలో వీరిద్దరూ నడిచే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిద్దరూ చేతులు పట్టుకొని నడవడంపై బీజేపీ మహారాష్ట్ర నాయకురాలు ప్రీతీ గాంధీ కీలక విమర్శలు చేశారు. వారిద్దరూ నడుస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తున్నారంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటో కాస్తా వైరల్ గా మారడంతో పలువురు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రీతీ గాంధీ చేసిన పోస్ట్ పై పూనమ్ కౌర్ స్పందించారు. ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టుగా ఉందని.. ప్రధాని మోడీ సైతం నారీశక్తి గురించి మాట్లాడారని చెప్పారు. తాను బ్యాలెన్స్ తప్పి కింద పడుతున్నపుడు ఆయన తన చెయ్యి పట్టుకున్నారని పూనమ్ స్పష్టం చేస్తూ.. ప్రీతీ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. ఇక ప్రీతీ చేసిన వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ సైతం మండిపడ్డారు.