హీరో రాజశేఖర్ రాజీనామా ఆమోదం

హీరో రాజశేఖర్ రాజీనామా ఆమోదం

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన గొడవ తర్వాత రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు వీకే నరేష్ వ్యవహారశైలి నచ్చకే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో రాజశేఖర్ తెలిపారు. అయితే ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రాజశేఖర్ రాజీనామాను ‘మా’ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు అధ్యక్షుడు నరేష్, ముఖ్య సలహాదారు కృష్ణంరాజు సంతకాలతో కూడిన ఒక ప్రెస్ నోట్‌ను ‘మా’ ఆదివారం విడుదల చేసింది.