నర్సింగ్ స్టూడెంట్స్ రాస్తారోకో కలెక్టరేట్ వద్ద ఆందోళన

నర్సింగ్ స్టూడెంట్స్ రాస్తారోకో కలెక్టరేట్ వద్ద ఆందోళన

మెదక్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ మెదక్​ పట్టణంలోని గవర్నమెంట్  నర్సింగ్​ కాలేజీ స్టూడెంట్లు రోడ్డెక్కారు. పిల్లికోటాల్​లోని హాస్టల్​ నుంచి ర్యాలీగా బయలుదేరి రాందాస్​ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రెవెన్యూ అధికారులు వారితో మాట్లాడి కలెక్టరేట్​కు తీసుకెళ్లారు. కలెక్టరేట్​ గేట్​ వద్ద నర్సింగ్​ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్​ లో 120 మంది స్టూడెంట్స్​ ఉంటే, ఒకే టాయిలెట్​ ఉందని వాపోయారు. బాత్రూమ్ లకు సరఫరా అయ్యే నీళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, చున్నీలతో వడబోసుకుని స్నానాలు చేయాల్సి వస్తోందన్నారు.

భోజనం కూడా క్వాలిటీ సరిగా ఉండడం లేదన్నారు. రూ.5 వేల స్టైఫండ్​ సైతం సకాలంలో రావడం లేదని వాపోయారు. ప్రిన్సిపాల్​ పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్​ స్టూడెంట్​ సమస్య తెలుసుకొని డీఐడీవో మాధవిని విచారణకు ఆదేశించారు. అనంతరం ఆమె ఆర్ఐ లక్ష్మణ్​తో కలిసి నర్సింగ్​ హాస్టల్​ను సందర్శించి సౌలతులను పరిశీలించారు.