
ప్రముఖ నటుడు సాయాజీ(Sayaji Shinde) షిండే ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆయన ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయనకి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
ఈ విషయం గురించి డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. సాయాజీ షిండే తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు.. కొన్ని పరీక్షలు చేయగా.. గుండెలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయని గుర్తించాం. వెంటనే.. ఆంజియోప్లాస్టీ చేయాలని చెప్పాం. ఆయన కూడా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. పరిస్తతి చెదాటకముందే జాగ్రత్తపడటంతో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. మరో రెండురోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు.. అని చెప్పుకొచ్చాడు.