
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ మెహర్(Suraj Meher)( 40) మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో సూరజ్ ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నటుడు సూరజ్ మెహర్ కన్నుమూయగా.. అతని సహచరుడు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
నిజానికి ఇవాళ(ఏప్రిల్ 11) ఒడిశాలో అతనికి నిశ్చితార్థం జరగాల్సింది. కానీ, శుభకార్యానికి ఒకరోజు ముందే ప్రమాదంలో ఆయన కన్నుమూయడంతో నటుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సూరజ్ మెహర్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.. ఆయన ఆత్మని శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.