పాతికేండ్ల తర్వాత ఎక్సయిట్ చేసిన కంగువ

పాతికేండ్ల తర్వాత ఎక్సయిట్ చేసిన కంగువ

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య.  ప్రస్తుతం ‘కంగువ’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నాయి.  ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్  సినిమాపై అంచనాలు పెంచాయి. 

తాజాగా ముంబైలో ‘కంగువ’ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ‘ఇలాంటి  గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా మారుతూ వచ్చింది. 

అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఈ సినిమాకు ఎక్సయిట్ అయి చేశా.  150 రోజులకు పైగా చేసిన షూట్‌‌‌‌‌‌‌‌లో ప్రతి రోజూ ఆ ఎక్సయిట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ చేశా. ఈ సినిమా మాకెంతో స్పెషల్.  అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.  ఇది సూర్య కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42వ చిత్రం. తనకు జంటగా దిశాపటానీ నటిస్తుండగా బాబీడియోల్ కీ రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో  త్రీడీ ఫార్మట్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.