
తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న కన్నడ యాక్టర్ వశిష్ట సింహా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘నయీం డైరీస్’. డిసెంబర్ 10న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా వశిష్ట ఇలా ముచ్చటించాడు. ‘‘మా నాన్న వాళ్లది కరీంనగర్. కర్ణాటకలో సెటిలయ్యాం. సినిమాలపై అవగాహన కోసం ట్రాక్ సింగర్, ఫొటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎడిటర్ అంటూ రకరకాల పనులు చేసి ఫైనల్‌గా యాక్టర్ అయ్యాను. ఈ కథ విన్నప్పుడు ఒక మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా అనిపిం చింది. పాత్రలోని డెప్త్, ఇంటర్నల్ ఎమోషన్స్ బాగా నచ్చాయి. నారప్ప, కేజీఎఫ్ చిత్రాల తర్వాత ఈ సినిమా చేయడం నాకో చాలెంజ్. యాంటీ సోషల్ ఎలిమెంట్ పాత్రలో ఎందుకు నటించావని అడుగుతున్నారు. నేనొక నటుణ్ని. అతని లైఫ్‌తో నాకు సంబంధం లేదు. హీరోకి ఉండే పరిమితులు విలన్‌కి ఉండవు కనుక నాకు నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం. అందుకే నటించా. చెడ్డవారి కథలు కూడా చూస్తేనే కదా అందరూ జాగ్రత్తగా ఉంటారు! ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2'తో పాటు సంపత్ నంది ప్రొడక్షన్‌లో ఓదెల రైల్వే స్టేషన్, శింబా చిత్రాలు చేస్తున్నాను.’’