కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కేవీయన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. విజయ్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, మమిత బైజు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. విజయ్ కెరీర్‌లో ఇది 69వ సినిమా. తన కెరీర్‌లో ఇదే చివరి చిత్రం. వచ్చే ఏడాది అక్టోబర్‌లో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
SET 2 is here 🔥
— KVN Productions (@KvnProductions) October 4, 2024
Paththala dhane? SET 3 erakiruvoma?#Thalapathy69Poojai#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja #MamithaBaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/VKFV5MPTZE