V6 News

నా మూడ్, నా డ్రెస్, నా ఇష్టం: పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది.. శివాజీ కామెంట్స్‌పై గాయత్రి ఫైర్!

నా మూడ్, నా డ్రెస్, నా ఇష్టం: పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది.. శివాజీ కామెంట్స్‌పై గాయత్రి ఫైర్!

టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా తెలుగు యూత్ ఆడియన్స్కి పరిచయం అక్కర్లేని పేరు. మొదట యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా, సినిమాలు, బోల్డ్ ఇంటర్వ్యూలతో మరింత పాపులర్ అయ్యింది.

లేటెస్ట్గా ఓ మూవీ ప్రమోషన్స్లో మాట్లాడిన మాటలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల నటుడు శివాజీ సూచించిన మహిళల వస్త్రధారణ విషయం ఎలాంటి ప్రకంపనలు స్పృష్టించిందో తెలిసిందే. ఇపుడు ఆ విషయంలో గాయత్రి గుప్తా రియాక్ట్ అయ్యి ఘాటుగా స్పందించింది.

“నేను ఏం ధరించాలి అనేది నా వ్యక్తిగత నిర్ణయం. నాకు కంఫర్ట్‌గా అనిపించేది నేనే వేసుకుంటాను. ఇతరుల అభిప్రాయాల వల్ల నేను మారను” అంటూ సూటిగా కౌంటర్ ఇచ్చారు. అలాగే “చూసే చూపులో సమస్య ఉంటే ఎదుటివారిని విమర్శించడం సరైంది కాదు” అని గాయత్రి మాట్లాడింది. వివరాల్లోకి వెళితే.. 

గాయత్రి గుప్తా ‘ఫస్ట్ టైం’ మూవీ ప్రమోషన్స్కి చీర కట్టుకుని వచ్చింది. చలాకీగా, మోడెర్న్ డ్రెస్సులతో వచ్చే గాయత్రి, ఈవెంట్కి చీరలో వచ్చినందుకు యాంకర్ ఆమెను ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. ‘శివాజీ గారు మహిళలు చీర కట్టుకుంటే పద్దతిగా ఉంటుందని చెప్పారు. అందుకే మీరు చీర కట్టుకుని వచ్చారా? లేక సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా?’ అని అడిగింది.

ఆ వెంటనే గాయత్రి గుప్తా స్పందిస్తూ..“బేసిగ్గా మీరు అడిగిన ఆ రెండు కావు. బికినీ వేసుకుంటా, శారీ వేసుకుంటా.. అది సందర్భం బట్టి, నా మూడ్ బట్టి. అంతేకాని, శారీ వేసుకుంటేనే పద్దతి? లేదా? అనేది వేసుకునే డ్రెస్ డిసైడ్ చేయదు.. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకం మొత్తం పచ్చగానే కనిపిస్తుంది..” అని గాయత్రి తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఇపుడు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుంటే, మరికొందరు శివాజీ అభిప్రాయాన్ని కేవలం సలహాగా తీసుకోవాల్సిందని అంటున్నారు. మరి ఈ విషయంపై శివాజీ స్పందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 

ఇకపోతే పాయల్ రాజ్ పుత్ లవర్ సౌరబ్ హీరోగా వస్తున్న మూవీ ఫస్ట్ టైం. హేమంత్ ఇప్పనపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా నటిస్తున్నారు. అనిక్క విక్రమన్ హీరోయిన్గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. మే 22న మూవీ రిలీజ్ కానుంది.