
కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘హెబ్బా పటేల్’ కు వరుస ఆఫర్లు వచ్చినా.. పెద్దగా హిట్ పడలేదు. ప్రస్తుతం చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా..కార్తీక్ గరిమెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తోంది. శ్యామ్ దేవభక్తుని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అర్చన, అశురెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమానికి కెఎస్ రామారావు హాజరయ్యారు. సుహాస్ కృష్ణ దేవభక్తుని క్లాప్ ఇవ్వగా, రమేష్ బాబు గరిమెళ్ల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ బాబు మండవ, నాగినీడులు స్క్రిప్ట్ అందించగా కేఎల్ నారాయణ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అన్నే రమేష్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా అర్జున్ రవి డీవోపీగా పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అఖిల దాసరి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక హెబ్బా పటేల్ విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో నటించిన హెబ్బా పటేల్.. కుర్రకారు మనస్సును దోచేసుకుంది. గతంలో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించింది. కానీ.. హెబ్బాకు రావాల్సిన ఇమేజ్ రాలేదు. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘రెడ్’ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈమె..అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతుంటాయి.
- తారాగణం : హెబ్బా పటేల్, అర్చన, ఆశు రెడ్డి
- టెక్నికల్ టీమ్ :
- దర్శకత్వం: కార్తీక్ గరిమెళ్ల
- నిర్మాత; శ్యామ్ దేవభక్తుని
- సంగీతం : సమర్థ్ గొల్లపూడి
- డీవోపీ: అర్జున్ రవి
- ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
- స్టంట్స్ : నందు
- కొరియోగ్రఫీ: అనే మాస్టర్
- సాహిత్యం: కృష్ణకాంత్
- ప్రొడక్షన్ మేనేజర్: ఎంవీ చందు కుమార్
- కాస్ట్యూమ్ డిజైనర్: అఖిల దాసరి
- మేకప్: సుబ్బు