పఫోస్(సైప్రస్): ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాడు. తొలి రౌండ్‌లో సంచలన విజయం సాధించిన ప్రజ్ఞా సోమవారం జరిగిన రెండో రౌండ్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ వీ యితో డ్రా చేసుకున్నాడు. ఈ పోరులో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద అద్భుతమైన వ్యూహాలతో పాయింట్ పంచుకున్నాడు.
46 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. 1.5 పాయింట్లతో ప్రజ్ఞా ఓపెన్ సెక్షన్‌లో సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. విమెన్స్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్, ఆర్. వైశాలి మధ్య జరిగిన గేమ్ 45 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది.
