బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ బైలింగ్విల్ మూవీ రాబోతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ ప్రాజెక్ట్‌ను సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.
‘‘ఈ ఏప్రిల్ నుంచి వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో కలిసి దిల్, దిమాగ్, జిగర్‌తో వస్తున్నా” అంటూ వంశీ పైడిపల్లితో కలిసున్న ఫొటోను సల్మాన్ షేర్ చేశారు. సల్మాన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సల్మాన్ సినిమాలు ఈద్ సీజన్‌లో రిలీజ్ కావడం అనే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
తమిళ హీరో విజయ్‌తో తీసిన ‘వారసుడు’ తర్వాత వంశీ పైడిపల్లి చేయబోతున్న సినిమా ఇదే. ఎస్‌వీసీ బ్యానర్‌లో 63వ చిత్రం. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా అపూర్వ లఖియా తెరకెక్కించిన ‘మాతృభూమి’ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది.
