ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక..  డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..నారాయణపేట జిల్లా అధికారులు  అవగాహన సదస్సు

 ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక..  డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..నారాయణపేట జిల్లా అధికారులు  అవగాహన సదస్సు

నారాయణపేట, వెలుగు : డ్రగ్స్ ‌‌, గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి యాంటీ డ్రగ్ సోల్జర్స్ ‌‌గా పని చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ డాక్టర్ వినీత్ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇంటర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులతో కలిసి చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల నుంచి మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం మెట్రో ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ఈగల్స్ ఫోర్స్, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణపై, - మాదకద్రవ్యాల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఈగల్స్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఎంహెచ్​ ఓ జయచంద్రమోహన్, ఆర్టీఓ మెగా గాంధీ, ఎక్సైజ్ సీఐ అనంతయ్య, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరేష్, గాయత్రి, కృష్ణ చైతన్య, గురవయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.