డ్రగ్స్ కేసులో కొన్నాళ్ల క్రితం తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా కుంగిపోయానని చెప్పింది నటి హేమ. సోమవారం ఫిలిం క్రిటిక్స్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హేమ మాట్లాడుతూ ‘డ్రగ్స్ కేసు వ్యవహారంలో కొన్ని మీడియా సంస్థలు నాపై నిరాధార ఆరోపణలు చేశాయి. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను.
నా కుటుంబం కూడా చాలా సఫర్ అయింది. అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ అయ్యింది. చివరకు నిర్దోషిగా బయటకు వచ్చాను’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ ప్రతినిధులు బత్తుల ప్రసాద్ రావు, ప్రభు, సురేష్ కొండేటి సహా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
