వరల్డ్ బెస్ట్ పారా ఆర్చర్‌‌‌‌‌‌‌‌.. మన శీతల్

వరల్డ్ బెస్ట్ పారా ఆర్చర్‌‌‌‌‌‌‌‌.. మన శీతల్

లాసానే: రెండు చేతులు లేకపోయినా.. కాళ్లతో బాణాలు వేస్తూ  ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఇండియా పారా ఆర్చర్ శీతల్ దేవికి మరో అరుదైన గౌరవం లభించింది. వరల్డ్ ఆర్చరీ ఆమెను ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025’గా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ చెందిన 19 ఏండ్ల శీతల్ తన  కాళ్లు, భుజాల సాయంతో విల్లు ఎక్కుపెట్టి అద్భుతాలు చేస్తోంది.

గతేడాది సౌత్‌‌‌‌ కొరియా వేదికగా జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ఆమె రెండు చేతులూ లేకుండా వరల్డ్ చాంపియన్‌‌‌‌ అయిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. పారిస్ పారాలింపిక్స్‌‌‌‌లో బ్రాంజ్ మెడల్, ఆసియా పారా గేమ్స్, ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన శీతల్ తాజాగా ఈ అత్యున్నత పురస్కారం కైవసం చేసుకుంది. ఈ విజయం తన ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమని, బెస్ట్ పారా ఆర్చర్‌‌‌‌‌‌‌‌గా నిలవడం గర్వంగా ఉందని శీతల్ ఈ సందర్భంగా పేర్కొంది.