సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీ 2026– -27 ఆర్థిక సంవత్సరానికి రూ.107.30 కోట్ల బడ్జెట్ ను రూపొందించి ఏకగ్రీవంగా ఆమోదించింది. నూతన పాలక మండలి ఏర్పాటు తర్వాత జరిగిన తొలి సాధారణ సమావేశంలో ముసాయిదా బడ్జెట్ ను సోమవారం ఆమోదించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి మాట్లాడుతూ.. ఆదాయ వనరులను పెంపొందించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇంటి పన్నుల ద్వారా రూ.1,775 లక్షలు, స్టాంప్ డ్యూటీ నుంచి రూ.600 లక్షలు, నాన్-ట్యాక్స్ ఆదాయం రూ.204.50 లక్షలు, పరిశుభ్రత నుంచి రూ.111.50 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా రూ.1,568.50 లక్షలు, ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ.330.50 లక్షలు ఆదాయం అంచనా ఉన్నట్టు వివరించారు. అదనంగా డిపాజిట్లు, రుణాల రూపంలో రూ.110 కోట్లు, నాన్-ప్లాన్ నిధులు రూ.620 లక్షలు, ప్లాన్ నిధులు రూ.5,170 లక్షలు, ఇతర నిధులు రూ.240 లక్షలు కలిపి మొత్తం రూ.107.30 కోట్ల బడ్జెట్ ను సిద్ధం చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ ఎం.డి. షఫీ ఉల్లా, కమిషనర్ సి.హెచ్. హన్మంతరెడ్డి
పాల్గొన్నారు.
