బీజేపీలో చేరిన జయసుధ.. పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్

బీజేపీలో చేరిన జయసుధ.. పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్

సీని నటి , మాజీ ఎమ్మెల్యే జయసుధ  బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ తదితరులు పాల్గొన్నారు.   జయసుధ ఇప్పటి వరకు చాలా రాజకీయ పార్టీలు మారారు.  

2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ గెలిచారు. ఆ తరవాత కొన్నాళ్ళకి టీడీపీలోకి చేరారు. గత ఎన్నికలకు ముందు  వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి , కిషన్  రెడ్డిలతోచర్చలు జరపి బీజేపీలో చేరారు.   అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ పెద్దలు జయసుధకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారో చూడాలి.

తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  ఇటీవల రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చేసింది అధిష్టానం. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలను కేంద్ర పార్టీ అధిష్టానం అప్పగించింది.