200 కోట్ల దోపిడీ కేసులో నోరాను విచారించిన పోలీసులు

200 కోట్ల దోపిడీ కేసులో నోరాను విచారించిన పోలీసులు

న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న 200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు.. నోరా ఫతేకి కూడా సుకేశ్ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో సుకేశ్, నోరాను సుదీర్ఘంగా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన విషయాలను ఈడీ చార్జిషీట్ లో పేర్కొంది. నోరాకు సుకేశ్ ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. కారును తిరిగి ఇచ్చేసినట్లు నోరా విచారణలో వెల్లడించింది.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి.. వారి భార్యల నుంచి ఏకంగా 200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. నటి జాక్వెలిన్  కు దాదాపు 10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.