Pooja Hegde: సూపర్ హిట్ సీక్వెల్లో పూజా హెగ్డే..బుట్టబొమ్మ కమ్‌ బ్యాక్‌ ఇచ్చేనా!

Pooja Hegde: సూపర్ హిట్ సీక్వెల్లో పూజా హెగ్డే..బుట్టబొమ్మ కమ్‌ బ్యాక్‌ ఇచ్చేనా!

వరుస అవకాశాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్​గా వెలిగిన పూజా హెగ్డేను గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సల్మాన్‌‌‌‌ ఖాన్ ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ హారర్ సిరీస్‌‌‌‌లో నటించే ఛాన్స్ ఆమెను వరించినట్టు తెలుస్తోంది.

కోలీవుడ్‌‌‌‌లో హారర్ సినిమాలు అనగానే రాఘవ లారెన్స్‌‌‌‌ తీసిన ‘కాంచన’ సిరీస్ గుర్తొస్తుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు చేసిన లారెన్స్.. ఇప్పుడు ‘కాంచన 4’ తీయబోతున్నాడు. ఇందుకోసం  ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్స్ వంద కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించబోతోంది.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌‌‌‌గా నటించేందుకు పూజాహెగ్డేను సంప్రదించినట్టు సమాచారం. మృణాల్ ఠాకూర్ ఇందులో నటించబోతోందంటూ ఇటీవల వార్తలొచ్చాయి.  కానీ లారెన్స్ మాత్రం పూజాహెగ్డే వైపు మొగ్గు చూపిస్తున్నట్టు కోలీవుడ్ టాక్.

ఇక హారర్ కామెడీ జానర్‌‌‌‌‌‌‌‌లో నటించడం పూజకు ఇదే ఫస్ట్ టైమ్. త్రిష, హన్సిక,  తమన్నా, రాశీఖన్నా లాంటి హీరోయిన్స్‌‌‌‌ హారర్ సినిమాల్లో నటించి విజయాలు అందుకున్నారు.  మరి పూజాహెగ్డేకు కూడా హారర్ జానర్ హిట్ ఇస్తుందేమో చూడాలి!