'శాకుంతలం' అద్భుతంగా ఉంది: సమంత

'శాకుంతలం' అద్భుతంగా ఉంది: సమంత

టాలీవుడ్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'శాకుంతలం'. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దర్శకుడు గుణశేఖర్ అద్భుతంగా తెరక్కించారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ  సినిమాను గురించి సమంత స్పందించారు.

 "ఈ సినిమాను చూశాను, అద్భుతంగా వచ్చింది. ఒక గొప్ప ఇతిహాసం జీవం పోసుకుంది. గుణశేఖర్ నా హృదయానికి చాలా దగ్గరగా ఈ సినిమాను ఆవిష్కరించారు. పిల్లలంతా కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ ను ప్రేమించడం ఖాయం.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ ను ఆస్వాదిస్తారు. ఈ సినిమాకి సంబంధించి సాగిన జర్నీని ఎప్పటికీ మరిచిపోలేను.. అందుకు కారణమైన దిల్ రాజు, నీలిమ గుణ లకు థ్యాంక్స్ చెబుతున్నాను.. ఈ సినిమా ఎప్పటికి నాకుకి దగ్గరగానే ఉండిపోతుంది" అని సమంత చెప్పారు.