
ప్రముఖ నటి శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ(మంగళవారం) ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రియ..కరోనా కారణంగా రెండేళ్లుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని తెలిపారు.