అదానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ రికార్డ్.. అత్యంత విలువైన మూడో ఆపరేటర్గా అవతరణ..

అదానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ రికార్డ్.. అత్యంత విలువైన మూడో ఆపరేటర్గా అవతరణ..
  • గ్లోబల్​ కంపెనీల నుంచి రూ.9,500 కోట్ల సేకరణ
  • కంపెనీ విలువ రూ.1.80 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: అదానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ సుమారు  బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,500 కోట్లు) ట్టుబడులను సమీకరించడం ద్వారా ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్​గా నిలిచింది. టెమాసెక్, బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్, ఆల్ఫా వేవ్ గ్లోబల్‌‌తో పాటు ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ ఇన్వెస్ట్ సంస్థలు నిధులు అందించాయి. 

ఈ పెట్టుబడులకు ముందు అదానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ విలువ 18 బిలియన్ డాలర్లు కాగా, కొత్త మూలధనంతో మొత్తం విలువ 19 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.1.80 లక్షల కోట్లు) చేరింది.  ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్​గా ఎదిగింది.  

స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఏనా, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ ఆఫ్ థాయిలాండ్ 1, 2  స్థానాల్లో ఉన్నాయి. ఈ నిధులతో విమానాశ్రయాల ఆధునీకరణ చేపట్టి వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని 20 కోట్లకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ముంబైతో కలిపి 8 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ ఎయిర్​పోర్ట్స్​కు, దేశీయ విమాన ప్రయాణికులలో 25 శాతం, కార్గో రవాణాలో 33 శాతం వాటా ఉంది.