పెట్రోల్ లో మరింత ఇథనాల్... ఈ‌‌-20కి మించి కలుపుతామన్న కేంద్ర ప్రభుత్వం

పెట్రోల్ లో మరింత ఇథనాల్... ఈ‌‌-20కి మించి కలుపుతామన్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: పెట్రోల్​లో ప్రస్తుతం ఉన్న 20 శాతం స్థాయిని మించి ఇథనాల్​ను కలపడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలకు దీనిని సరఫరా చేస్తామని ప్రధానమంత్రి సలహాదారు తరుణ్ కపూర్  వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఈ–20 కార్యక్రమం విజయం సాధించింది. త్వరలోనే ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో రాబోతున్నాయి. అవి ఎక్కువ ఇథనాల్ వాడుకుంటాయి” అని తెలిపారు.​  

సాధారణంగా 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఈ–20 అని పిలుస్తారు.  ఇథనాల్​పెట్రోల్​పై అసత్య ప్రచారాలు.. స్వార్థ ప్రయోజనాల కోసమే పుట్టుకొస్తున్నాయని కపూర్ స్పష్టం చేశారు.   ఈ–20తో వాహనాలకు నష్టం లేదని స్టడీలు తేల్చాయని అన్నారు.