వార్తా సంస్థ ఐఏఎన్​ఎస్​లో అదానీకి మెజారిటీ వాటా

వార్తా సంస్థ ఐఏఎన్​ఎస్​లో అదానీకి మెజారిటీ వాటా

న్యూఢిల్లీ :  బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఉనికిని విస్తరించుకుంటోంది. వార్తా సంస్థ ఐఏఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఈ డీల్​ విలువను మాత్రం బయటపెట్టలేదు.  అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్  అనుబంధ సంస్థ  ఏఎంజీ మీడియా నెట్‌‌‌‌‌‌‌‌వర్క్స్ లిమిటెడ్ ఐఏఎన్​ఎస్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిందని  రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. బిజినెస్  ఫైనాన్షియల్ న్యూస్, డిజిటల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ బీక్యూ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను గత ఏడాది అదానీ కొనుగోలు చేసింది.

ఈ డీల్​ ద్వారా అదానీ గత మార్చిలో మీడియా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో న్యూస్​ చానెల్​ఎన్​డీటీవీలో దాదాపు 65 శాతం వాటాను తీసుకుంది. ఈ కొనుగోళ్లను ఏఎంఎన్​ఎల్​ ద్వారా పూర్తి చేసింది. ఐఏఎన్​ఎస్​కి సంబంధించి వారి ఇంటర్- సె రైట్‌‌‌‌‌‌‌‌లను (రెండు పార్టీల మధ్య ప్రత్యేక హక్కులు) రికార్డ్ చేయడానికి ఐఏఎన్​ఎస్​తోపాటు​  ఐఏఎన్​ఎస్​  వాటాదారు సందీప్ బామ్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌తో ఏఎంఎన్​ఎల్​ వాటాదారుల ఒప్పందంపై సంతకం చేసింది.  ఐఏఎన్​ఎస్​ 2022-–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.86 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక నుంచి ఐఏఎన్​ఎస్ ఆపరేషనల్​, మేనేజ్​మెంట్ కంట్రోల్​  ఏఎంఎన్​ఎల్​ వద్ద ఉంటుంది.   డైరెక్టర్లను నియమించే హక్కు కూడా దఖలు పడింది.