- ఓపెన్ ఏఐలో అమెజాన్ భారీ పెట్టుబడి..
న్యూఢిల్లీ: యూఎస్ టెక్ కంపెనీ ఓపెన్ ఏఐ నిర్వహించిన ఫండింగ్ రౌండ్‌లో అమెజాన్ సంస్థ 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.55 లక్షల కోట్ల) భారీ పెట్టుబడి పెట్టింది. ఒక సంస్థలో అమెజాన్ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్, ఎన్విడియా కార్పొరేషన్ కూడా 30 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడి పెట్టాయి.
తాజా నిధులతో ఓపెన్ ఏఐ విలువ 840 బిలియన్ డాలర్లకు చేరింది. ఒప్పందంలో భాగంగా ఓపెన్ ఏఐ తన సొంత ఏఐ చిప్ ట్రేనియమ్‌ను వాడుతుంది. వచ్చే ఎనిమిదేళ్లలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కోసం మరో వంద బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
