తెలంగాణలో 200 కొత్త స్టోర్లు ప్రారంభిస్తాం..అపోలో ఫార్మసీ ప్రకటన

తెలంగాణలో 200 కొత్త స్టోర్లు ప్రారంభిస్తాం..అపోలో ఫార్మసీ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు:  రాబోయే మూడేళ్లలో తెలంగాణలో మరో 200 కొత్త స్టోర్లు ప్రారంభిస్తామని అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్–చైర్మన్​ ఉపాసన ప్రకటించారు. హైదరాబాద్​లో శనివారం 1000వ స్టోర్​ను ప్రారంభించాక మాట్లాడుతూ, పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. తమ ఫార్మసీ చెయిన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సేవలు అందిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని వివరించారు.