మరోసారి బాండ్స్​ బైబ్యాక్​ చేపడుతోన్న అదానీ పోర్ట్స్​ అండ్​ స్పెషల్​ ఎకనమిక్​ జోన్​

మరోసారి బాండ్స్​ బైబ్యాక్​ చేపడుతోన్న అదానీ పోర్ట్స్​ అండ్​ స్పెషల్​ ఎకనమిక్​ జోన్​

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​లోని అదానీ పోర్ట్స్​ అండ్​ స్పెషల్​ ఎకనమిక్​ జోన్​ మరోసారి బాండ్స్​ బైబ్యాక్​ చేపడుతోంది. 2024 లో తిరిగి చెల్లించాల్సిన 195 మిలియన్​ డాలర్ల విలువైన బాండ్స్​ను తన వద్ద ఉన్న నగదు నిల్వలతో బై బ్యాక్ చేయనున్నట్టు ప్రకటించింది. యూఎస్​ షార్ట్​సెల్లర్​ హిండెన్​బర్గ్​ఆరోపణల తర్వాత ఇన్వెస్టర్ల నమ్మకం పెంచుకునేందుకు అదానీ గ్రూప్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

మొత్తం చెల్లించాల్సిన బాండ్స్​ 520 మిలియన్​ డాలర్లని, తాజా బైబ్యాక్​ను మినహాయిస్తే ఇంకా 325 మిలియన్​ డాలర్లు మిగిలి ఉంటుందని కంపెనీ స్టాక్​ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ఒకసారి 130 మిలియన్​ డాలర్ల విలువైన బాండ్స్​ బ్యాక్​ను కంపెనీ చేపట్టింది. బాండ్స్​ బైబ్యాక్​ కోసం తెచ్చిన టెండర్​ అక్టోబర్​ 26 దాకా ఓపెన్​లో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.